: కోల్ ఆర్డినెన్స్, బీమా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
బొగ్గు క్షేత్రాల వేలం, బీమా రంగంలో ఎఫ్ డీఐల శాతం పెంపుకు సంబంధించిన బిల్లుల శాసనాలకు కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. దాంతో, 2008 నుంచి పెండింగ్ లో ఉన్న బీమా బిల్లు తాజాగా ఆమోదం పొందడం విశేషం. దాని ద్వారా బీమా కంపెనీల్లో పెట్టుబడి శాతం 26 నుంచి 49కి పెరగనుంది. ఈ మేరకు కేబినెట్ సమావేశ వివరాలను మీడియాకు తెలిపిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, బీమా సంస్కరణలకు సంబంధించి తీసుకున్న నిర్ణయంపై ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ విషయంలో పార్లమెంటు అడ్డుపడటం గానీ, సంస్కరణలలో ఆలస్యం చేయడాన్ని అనుమతించమని చెప్పారు. సంస్కరణలు తీసుకొచ్చేందుకు భారతదేశం ఇక వేచి చూడదన్న సందేశాన్ని బీమా రంగంలో ఆర్డినెన్స్ పంపుతుందని జైట్లీ పేర్కొన్నారు.