: పార్టీ ప్రధాన కార్యదర్శులతో భేటీ కానున్న రాహుల్ గాంధీ
జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులతో నేడు భేటీ కానున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం సోషల్ నెట్ వర్క్ సైట్లలో రాహుల్ పనితీరుపై విమర్శల జడివాన కురిసింది. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శులతో అత్యవసర భేటీకి ఆయన సిద్ధపడ్డారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో జమ్మూ కాశ్మీర్ లో 12 సీట్లు సాధించిన పార్టీ, జార్ఖండ్ లో ఆరు సీట్లకే పరిమితమైంది. ఈ భేటీకి పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానాలకు చెందిన పార్టీ ఇంచార్జిలు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన ఆదేశించారు.