: కమల్ హాసన్ కు దక్కని 'చివరిచూపు'!
తనకు నటభిక్ష పెట్టిన దర్శక దిగ్గజాన్ని కడసారి చూసుకునే భాగ్యానికి కమల్ హాసన్ దూరం కానున్నాడు. తన గురువు కె.బాలచందర్ మరణ వార్త తెలుసుకొని అమెరికా నుంచి ఆఘమేఘాల మీద ఆయన బయలుదేరినప్పటికీ, ఈ రాత్రికి మాత్రమే ఆయన చెన్నై చేరుకునే అవకాశముంది. ఈలోగానే బాలచందర్ అంత్యక్రియలు ముగియనున్నాయి. తన తాజా చిత్రం 'ఉత్తమ్ విలన్' పోస్టు ప్రొడక్షన్ పనుల కోసం కమల్ హాసన్ లాస్ ఏంజెలెస్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలచందర్ కూడా నటించారు. బాలచందర్ మరణవార్త తెలియగానే ఆయన బయలుదేరారని, ఈ రాత్రికి చెన్నై చేరుకుంటారని కమల్ హాసన్ మేనేజర్ తెలిపారు. బాలచందర్ తో కలిసి కమల్ 40కి పైగా చిత్రాలలో పనిచేశారు.