: కల్తీ చేస్తే చీల్చి చెండాడుతాం: ఈటెల
ప్రజలకు విక్రయించే ఏ వస్తువునైనా కల్తీ చేసే వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. నేటి ఉదయం జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆహార పదార్థాల కల్తీ క్షమించరాని నేరంగా అభివర్ణించిన ఆయన, కల్తీ చేస్తే చీల్చి చెండాడుతామని అన్నారు. కల్తీల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, పట్టుబడే వ్యాపారులకు తొలుత కౌన్సెలింగ్ ఇస్తామని, మారకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు.