: ఢిల్లీలో బీజేపీకి నాయకత్వమే లేదు: అరవింద్ కేజ్రీవాల్
తమపై ఆరోపణలను తగ్గించకుంటే కోర్టుకు లాగుతామన్న బీజేపీకి ఏమాత్రం బెదిరేది లేదంటున్నారు ఢిల్లీ తాజా మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. బీజేపీకి ఢిల్లీలో నాయకత్వమే లేదని ఆయన నేడు ట్విట్టర్ లో పేర్కొన్నారు. ‘‘ఢిల్లీలో బీజేపీ క్రమంగా దిగజారుతోంది. అజెండా లేదు. దిశ లేదు. నాయకత్వమూ లేదు. అందుకే ఆ పార్టీ భగోడా (పలాయన) అజెండాను ప్రజలు తిరస్కరిస్తున్నారు’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఇటీవల హర్యానా, మహారాష్ట్రల్లో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ, రెండు రాష్ట్రాల్లోనూ సరైన పాలన సాగించడం లేదని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను ఢిల్లీకి విస్తరించిన కేజ్రీవాల్ తాజా ఆరోపణలు చేశారు.