: మతం మార్చుకుంటారా? లేక దేశం వీడి పోతారా?: బంగ్లా శరణార్థులకు భజరంగ్ దళ్ హెచ్చరిక
ఇండియాలో నివసిస్తున్న బంగ్లాదేశ్ శరణార్థులు తక్షణం దేశం విడిచి వెళ్ళాలని... ఇక్కడే బతకాలని నిర్ణయించుకుంటే హిందూ మతంలోకి మారాలని భజరంగ్ దళ్ హెచ్చరికలు జారీ చేసింది. 'ఘర్ వాపసి' కార్యక్రమం ఇప్పటిది కాదని, యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొనసాగిందని మీరట్ భజరంగ్ దళ్ కన్వీనర్ బాలరాజ్ దుంగార్ తెలిపారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులు ఇండియాలో స్థిరపడిపోయారని ఆయన గుర్తు చేశారు. కాగా, 2001 గణాంకాల ప్రకారం దేశంలో 30 లక్షల మందికి పైగా బంగ్లా శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు.