: వాజ్ పేయి, మాలవ్యాలకు భారతరత్న: కేంద్రం తీర్మానం
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, స్వాతంత్ర్య సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యాలకు భారతరత్న పురస్కారాలను ఇవ్వాలని కేంద్రం తీర్మానించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ముగిసిన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో కేంద్రం అధికారికంగా ప్రకటన చేయనుంది. దేశంలో సుపరిపాలన అందించిన ప్రధానిగా వాజ్ పేయి ఖ్యాతిగాంచారు. వాజ్ పేయికి భారతరత్న ప్రకటించాలని కొంతకాలంగా బీజేపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వాజ్ పేయితో పాటు స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక భూమిక పోషించడమే కాక విద్యావేత్తగా ఎదిగిన మదన్ మోహన్ మాలవ్యాకు కూడా భారతరత్నను అందించాలని కేంద్రం తీర్మానించింది.