: భారతరత్న ఇచ్చినా గుర్తించే స్థితిలో లేని వృద్ధ నేత
బీజేపీ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించినా దాన్ని గుర్తించే స్థితిలో ఆయన లేరు. భారతరత్న వచ్చిందని ఆయనకు చెప్పినా అర్థంకాని పరిస్థితి. ఆయనకు అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధి అడ్వాన్స్డ్ స్టేజిలో ఉండటమే ఇందుకు కారణం. చిన్ననాటి సహచరుడు అద్వానీని సైతం ఆయన గుర్తించలేరు. తనకు సపర్యలు చేస్తున్న వారెవరో కూడా ఆయనకు తెలియదు. కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆయనను ఇటీవల ప్రధాని మోదీ పరామర్శించి వచ్చిన సంగతి తెలిసిందే.