: ఆసుపత్రిలో చేరిన సీనియర్ బుష్
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యు బుష్ (90) ఆరోగ్య కారణాలతో టెక్సాస్ లోని ఆసుపత్రిలో చేరారు. శ్వాస ఆడకపోవటంతో ఇబ్బంది పడుతున్న కారణంగా వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లామని కుటుంబ ప్రతినిధి జిమ్ మెక్ గ్రాత్ తెలిపారు. "సీనియర్ బుష్ ను హ్యూస్టన్ మెథడిస్ట్ ఆసుపత్రిలో చేర్పించాము. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంతో ఆంబులెన్సులో ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఆయనకిప్పుడు తొంబై ఏళ్లు. ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల అబ్జర్వేషన్ లో ఇక్కడే ఉంచుతాం" అని చెప్పారు. గతేడాది జనవరిలో ఇదే ఆసుపత్రిలో రెండు నెలల పాటు బుష్ చికిత్స పొందారు. ప్రస్తుతం టెక్సాస్ లో నివసిస్తున్న ఆయన కొంతకాలంగా వీల్ చైర్ కే పరిమితమయ్యారు.