: పొగమంచు గుప్పిట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టు... విమానాల దారి మళ్లింపు


హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పొగమంచుతో నిండిపోయింది. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోయిన నేపథ్యంలో నేటి తెల్లవారుజాము నుంచి ఎయిర్ పోర్టు పరిసరాలు పొగమంచులో కూరుకుపోయాయి. దీంతో విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. శంషాబాద్ నుంచి బయలుదేరాల్సిన పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు శంషాబాద్ కు వస్తున్న విమానాలను దారి మళ్లిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వస్తున్న విమానాలను బెంగళూరు, చెన్నైలకు మళ్లించారు.

  • Loading...

More Telugu News