: బీజేపీకి చెక్ పెట్టేలా కాశ్మీర్లో మారిన వ్యూహం... పీడీపీతో దోస్తీకి సిద్ధమన్న ఒమర్
జమ్మూ కాశ్మీర్లో తొలిసారిగా అధికార పీఠం దక్కించుకోవాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు గండి పడేలా ఉంది. బీజేపీకి చెక్ పెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్న ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ అవసరమైతే పీడీపీకి మద్దతిచ్చే ఆలోచనలో ఉంది. ఈ విషయాన్ని ఒమర్ ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు. పీడీపీతో దోస్తీకి తమ పార్టీ సిద్ధమన్న సంకేతాలు పంపారు.