: విజయవాడలో పెరుగుతున్న నైట్ కల్చర్... తొలి నైట్ ఫుడ్ కోర్ట్ ప్రారంభం
నవ్యాంధ్ర కొత్త రాజధానిగా ఎదుగుతున్న క్రమంలో విజయవాడలో నైట్ కల్చర్ పెరుగుతోంది. రాత్రి పూట జీవనాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి నైట్ ఫుడ్ కోర్టును ఇందిరాగాంధీ పురపాలక స్టేడియం ఆవరణలో నిన్న రాత్రి కలెక్టర్ రఘునందన్‌రావు ప్రారంభించారు. రాత్రి పూట ప్రజలు ఎలాంటి అభద్రతాభావానికి గురి కాకుండా ఫుడ్ కోర్టులో ఆహారాన్ని తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఫుడ్ కోర్ట్ విజయవంతం అయితే మరిన్ని ప్రాంతాల్లో ఇదే తరహా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇక్కడ ఇడ్లీ, వడ, దోశ, బోండా వంటి దక్షిణాది రకాలతో పాటు చాట్, పానీ పూరి తదితర ఉత్తరాది ఆహార పదార్ధాలూ అందుబాటులో ఉంటాయి.