: నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ...జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ లపై కీలక చర్చ
బీజేపీ పార్లమెంటరీ బోర్డు నేటి ఉదయం 11.30 గంటలకు భేటీ కానుంది. జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ లలో మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాలపై భేటీలో కీలక చర్చ జరగనుంది. జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సాధించిన ఆ పార్టీ, జమ్మూ కాశ్మీర్ లో మెరుగైన ఫలితాలను సాధించింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ కు కొత్త ముఖ్యమంత్రి ఖరారు, జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై భేటీలో పార్టీ అగ్రనేతలు నిర్ణయం తీసుకోనున్నారు. మంగళవారం సాయంత్రమే ఈ భేటీ నిర్వహించాలని తలచినా, అనివార్య కారణాల వల్ల నేటికి వాయిదా పడింది. జమ్మూ కాశ్మీర్ లో పీడీపీ(28)కి అతి సమీపంలో వచ్చిన బీజేపీ 25 సీట్లను కైవసం చేసుకుని సత్తా చాటిన నేపథ్యంలో నేటి భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తోంది.