: బాలచందర్ కు నివాళిగా నేడు కోలీవుడ్ బంద్
ప్రముఖ సినీ దర్శకుడు బాలచందర్ మృతికి సంతాపంగా నేడు తమిళ చలనచిత్ర రంగం కోలీవుడ్ తన కార్యకలాపాలను పూర్తిగా రద్దు చేసుకుంది. బాలచందర్ కు నివాళిగా నేడు చిత్ర పరిశ్రమలో అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు కోలీవుడ్ ప్రకటించింది. దీంతో నేడు తమిళనాడు వ్యాప్తంగా కోలీవుడ్ చిత్రాల షూటింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. మరోవైపు బాలచందర్ భౌతిక కాయానికి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు ప్రసన్న ప్రకటించారు. ప్రజల సందర్శనార్థం నేడంతా బాలచందర్ మృతదేహాన్ని తమ ఇంటి ఆవరణలో ఉంచనున్నామని ఆయన తెలిపారు.