: వాజ్ పేయి, మాలవ్యాలకు భారతరత్న: నేడు రాష్ట్రపతికి ప్రధాని సిఫారసు
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, స్వాతంత్య్ర సమర యోధుడు, ప్రముఖ విద్యావేత్త మదన్ మోహన్ మాలవ్యాలకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానానికి దాదాపుగా రంగం సిద్ధమైంది. ఇద్దరు ప్రముఖులకు భారతరత్న ప్రకటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రతిపాదనలు వెళ్లనున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. డిసెంబర్ 25న వాజ్ పేయి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ అవార్డులను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఫ్రొఫెసర్ సీఎన్ఆర్ రావు, క్రికెటర్ సచిన్ లకు భారతరత్నను ప్రదానం చేసిన సమయంలోనే వాజ్ పేయికి భారతరత్న పురస్కారంపై బీజేపీ గళమెత్తింది. తాజాగా అధికారంలొోకి వచ్చిన ఆ పార్టీ, తాననుకున్నట్లు వాజ్ పేయితో పాటు మాలవ్యాకు కూడా ఈ పురస్కారాన్ని అందించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది.