: నేడు గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన... నవ్యాంధ్ర క్రిస్ మస్ వేడుకలకు హాజరు


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటు కానున్న జిల్లాలో సీఆర్డీఏ బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత తొలిసారిగా వస్తున్న చంద్రబాబుకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు జిల్లా నేతలు సన్నాహాలు చేస్తున్నారు. స్పీకర్ సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం గుంటూరులో జరగనున్న క్రిస్ మస్ వేడుకల్లో ఆయన పాలుపంచుకుంటారు. రాష్ట్ర విభజన తర్వాత తొలి క్రిస్ మస్ వేడుకల నేపథ్యంలో పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News