: బాలచందర్ మృతి పట్ల గవర్నర్, చంద్రబాబు సంతాపం
ప్రముఖ దర్శకుడు, రచయిత, నిర్మాత బాలచందర్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారు. బాలచందర్ మృతి చిత్రరంగానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. తమిళ, తెలుగు చిత్రరంగాలకు బాలచందర్ చేసిన సేవలను ఆయన కొనియాడారు.