: పాత నోట్లు మార్చుకునే గడువు పొడిగింపు


కరెన్సీ నోట్ల మార్పిడికి గడువును పొడిగించారు. 2005 కంటే ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు గడువును ఆర్బీఐ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 500 రూపాయలు, 1,000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ జనవరి 1, 2015 వరకు ఇచ్చిన గడువును జూన్ 30 వరకు పొడిగించింది. 2005 కంటే ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ 2014 జనవరి 22న ప్రజలకు తెలిపింది. ఆర్బీఐ ప్రకటించిన అనంతరం సుమారు 144.66 కోట్ల రూపాయలను బ్యాంకుల్లో మార్చుకున్నారని సమాచారం. కాగా 2005 తరువాత ఆర్బీఐ ముద్రించిన కరెన్సీ నోట్లపై నోటు తయారు చేసిన ఏడాదిని ముద్రించారని, అంతకు ముందు ముద్రించిన కరెన్సీపై సంవత్సరం ఉండదని ఆర్బీఐ తెలిపింది.

  • Loading...

More Telugu News