: కమల్, రజనీకాంత్ ల గురువు, దర్శకుడు బాలచందర్ కన్నుమూత


ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ (84) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. రజనీకాంత్, కమల్ హాసన్, సరిత, ప్రకాశ్ రాజ్ వంటి నటీనటులను ఆయన వెండితెరకు పరిచయం చేశారు. 1930 జూలై 9న తమిళనాడులోని తంజావూరులో జన్మించిన బాలచందర్ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతులేనికధ, ఆకలి రాజ్యం, మరోచరిత్ర వంటి 101 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. పలు సినిమాలకు ఆయన నిర్మాత, రచయితగా కూడా వ్యవహరించారు. ఆయన కీర్తి కిరీటంలో పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే, ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం, కళైమామణి వంటి ఎన్నో అవార్డులు ఉన్నాయి. తొమ్మిది జాతీయ ఫిల్మ్ అవార్డులు అందుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆయన చివరి సినిమా ఉదయ్ కిరణ్ నటించిన 'అబద్ధం' కావడం విశేషం. ఆయన మృతిపట్ల తెలుగు, తమిళ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News