: 50 రోజుల్లో 50 కోట్లు సంపాదించిన ఘనత టీడీపీదే: బాబు


50 రోజుల్లో 50 కోట్ల రూపాయలు సంపాదించిన ఘనత టీడీపీకే చెల్లిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఎన్టీఆర్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, 50 లక్షల మంది క్రియాశీలక సభ్యులున్న ఏకైక పార్టీ తెలుగుదేశం అన్నారు. మనకు ఏదైనా జరిగితే వెనుక పార్టీ ఉందన్న భరోసాను టీడీపీ కార్యకర్తలకు ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి కార్యకర్త వెనుక పార్టీ నిలబడుతుందని ఆయన తెలిపారు. పార్టీ కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, కార్యకర్తల సంక్షేమమే పార్టీ ప్రధాన కర్తవ్యమని ఆయన వెల్లడించారు. కేవలం 50 రోజుల్లో 50 లక్షల మంది కార్యకర్తలను సంపాదించుకోవడం మామూలు విషయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News