: పేకాట రాయుళ్ల ఊరేగింపు


కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలో పేకాటరాయుళ్లను ట్రాక్టర్ పై ఊరేగిస్తూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. కొలిమిగుండ్లలో పలువురు పేకాటరాయుళ్లు నిత్యం పేకాట క్లబ్ లలో కాలం వెళ్లబుచ్చుతున్నారని వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన సమాచారంతో పేకాట క్లబ్బులపై పోలీసులు మూకుమ్ముడి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాటాడుతున్న 50 మంది జూదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్దఎత్తున నగదు, సెల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారికి సిగ్గు వచ్చేలా ట్రాక్టర్ పై ఊరేగిస్తూ వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News