: ఆయనతో రొమాన్స్ భలే ఇబ్బంది: మల్లికా శెరావత్
శృంగార సన్నివేశాలను రక్తి కట్టించే నటిగా ఫేమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ మల్లికా శెరావత్. టూపీస్ బికినీ అయినా, హాట్ లిప్ లాక్ అయినా ఏ మాత్రం మొహమాటం లేకుండా నటిస్తుందని పేరుగాంచిన మల్లికా శెరావత్ ఓ నటుడితో రొమాన్స్ చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిందట. ఈ విషయం మల్లికే చెప్పింది. బాలీవుడ్ సీనియర్ నటుడు ఓంపురితో రొమాన్స్ చేసేందుకు తాను చాలా ఇబ్బంది పడ్డానని, అయితే, ఆయన తనకు ఇబ్బంది కలగకుండా వ్యవహరించారని మల్లిక తెలిపింది. ఈ సినిమా దేశంలో సంచలనం రేపిన భన్వరీదేవి సెక్స్ స్కాండల్ ఆధారంగా రూపొందుతోంది. కాగా, ఈ సినిమా పేరు 'డర్టీ పాలిటిక్స్'గా నామకరణం చేశారు.