: డీజీపీ నియామకం చెల్లదంటూ కొడాలి నాని పిటిషన్
ఏపీ డీజీపీగా జేవీ రాముడు నియామకం చెల్లదంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని హైకోర్టులో పిటిషన్ వేశారు. నిబంధనలను పట్టించుకోకుండా ఆయనను డీజీపీగా నియమించారని నాని తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశాలున్నాయి. కాగా, అధికార పార్టీ నియామకాలను విపక్షాలు వ్యతిరేకించడం సహజమేనని అధికారులు అంటున్నారు. ఈ పిటిషన్ కూడా ఆ క్రమంలోనే దాఖలైందని వారు అభిప్రాయపడ్డారు.