: జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో 36 ఏళ్ల రికార్డు బద్దలైంది!


జమ్మూ కాశ్మీర్ లో మూడున్నర దశాబ్దాలకు పైగా కొనసాగిన రికార్డు బద్దలైంది. జమ్మూకాశ్మీర్ లో గత 36 ఏళ్లుగా శాసనసభ్యుడిగా కొనసాగుతున్న ఆర్థిక మంత్రి అబ్దుల్ రహీం తాజా ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. సెంట్రల్ కాశ్మీర్ లోని చరార్-ఈ-షరీఫ్ అసెంబ్లీ స్థానానికి 36 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన అదే నియోజకవర్గం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తరపున పోటీ చేశారు. ఆయన పీడీపీ అభ్యర్థి గులాంనబీ లోన్ చేతిలో పరాజయం పాలయ్యారు. గత రెండు పర్యాయాలు ఆయనపై ఓటమి పాలైన లోన్ ఈసారి గురి తప్పకుండా విజయం సాధించి, అబ్దుల్ రహీం రికార్డుకు చరమగీతం పాడారు.

  • Loading...

More Telugu News