: తెలంగాణలో వక్ఫ్ ట్రైబ్యునల్ ఏర్పాటు
తెలంగాణలో వక్ఫ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రైబ్యునల్ ఛైర్మన్ గా రాష్ట్ర స్థాయి జ్యుడీషియల్ స్పెషల్ జడ్జిని నియమించనుంది. ముస్లింల భూములు, ఇతర ఆస్తుల పరిరక్షణకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.