: కాకా మృతికి రాష్ట్రపతి సంతాపం
కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం తెలియజేశారు. ఈ సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన అంత్యక్రియలకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరవుతున్నారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ కాకా తనయుడు, మాజీ ఎంపీ వివేక్ కు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ సందర్భంగా సంతాపం తెలిపారు. 'కాకా'గా ప్రసిద్ధుడైన ఈ కాంగ్రెస్ వాది గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కాకా గతంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.