: 'పీకే' సీక్వెల్ చేయడమంటే ఇష్టం: అమీర్ ఖాన్
తన తాజా చిత్రం 'పీకే'కు సీక్వెల్ వస్తుందా? లేదా? అన్న విషయంపై అంత స్పష్టత లేదని చెబుతున్నాడు నటుడు అమీర్ ఖాన్. అయితే రెండవ భాగం చేయడం మాత్రం చాలా ఇష్టమని చెబుతున్నాడు. సీక్వెల్ వర్క్ జరుగుతుందటగా? అని అమీర్ ను అడిగితే, "చూద్దాం. మీరంతా దర్శకుడు రాజు హిరానీని ఈ ప్రశ్న అడగండి. సీక్వెల్ చేయాలని తనకు ఆసక్తి ఉంటే రూపొందిస్తాడు, చాలా మంచిది. చేయడం నాకు కూడా ఇష్టమే" అన్నాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో అమీర్ తో పాటు రణబీర్ కపూర్ కూడా కనిపించాడు. అందుకే చాలామంది పీకేకు తప్పకుండా సీక్వెల్ ఉంటుందంటున్నారు. ఇందుకు కూడా అమీర్ స్పందిస్తూ, "రణబీర్ ను, నన్ను సీక్వెల్ లో పెట్టాలని హిరానీ అనుకుంటాడేమో!" అన్నాడు.