: ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. డిసెంబర్ 18న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు మొత్తం ఐదు రోజుల పాటు కొనసాగాయి. ఆద్యంతం సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. అధికార, విపక్ష సభ్యులు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటూ, సెటైర్లు వేసుకుంటూ సమావేశాలను రక్తికట్టించారు. కీలకమైన సీఆర్డీఏ బిల్లుకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది.