: భారత స్పిన్నర్లలో పస లేదంటున్న బ్రాడ్ హాగ్


ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ టీమిండియా స్పిన్నర్ల విషయమై పెదవి విరిచాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న స్పిన్నర్లలో పస లేదని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా, అటాకింగ్ స్పిన్నర్ లేకపోవడం పర్యాటక జట్టు అవకాశాలపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నాడు. గత నాలుగు ఇన్నింగ్సులలో ఆసీస్ జట్టును ఒక్కసారి మాత్రమే ఆలౌట్ చేయగలిగారని, నాణ్యమైన స్పిన్నర్లు లేకపోవడం కూడా బౌలింగ్ వైఫల్యాలకు కారణమని హాగ్ విశ్లేషించాడు. తాజా సిరీస్ లో ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ 4 ఇన్నింగ్సులలో 17 వికెట్లు తీసుకోగా, భారత స్పిన్నర్లు 3 ఇన్నింగ్స్ లలో 6 వికెట్లు మాత్రమే తీయడం పరిస్థితికి అద్దం పడుతోంది. గణాంకాలపై మాట్లాడుతూ, ఆస్ట్రేలియాలో బౌలింగ్ చేయడం అంత సులువు కాదని హాగ్ అన్నాడు. పిచ్ పై బౌన్స్ ను ఉపయోగించుకుని లియాన్ లబ్ది పొందాడని వివరించాడు. భారత స్పిన్నర్లు ఈ విషయంలో విఫలమయ్యారని ఈ విలక్షణ బౌలర్ తెలిపాడు.

  • Loading...

More Telugu News