: మరో ఉగ్రదాడి జరగవచ్చు: ఆస్ట్రేలియా ప్రధాని హెచ్చరిక


సిడ్నీ కేఫ్ లో ఉగ్రదాడి జరిగిన అనంతరం ఆస్ట్రేలియా అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ మాట్లాడుతూ, మరో ఉగ్రదాడి జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని స్పష్టం చేశారు. అయితే, ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తారనే విషయాన్ని మాత్రం ముందుగా చెప్పలేమని అన్నారు. ప్రజలంతా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని, అన్ని రకాల జాగ్రత్తలను పాటించాలని చెప్పారు. పోలీసు దళాలు ప్రజా రక్షణ నిమిత్తం పూర్తి అప్రమత్తతతో ఉన్నాయని అబాట్ తెలిపారు.

  • Loading...

More Telugu News