: విమాన టిక్కెట్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ!


విమాన ప్రయాణ చార్జీలను ఎయిర్ లైన్స్ కంపెనీలు ఇష్టానుసారం మార్చుతుండటంతో తాత్కాలిక నియంత్రణా విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. విమాన టిక్కెట్ల ధరలో గరిష్ఠ పరిమితి (అప్పర్ లిమిట్) విధించాలని యోచిస్తున్నట్టు పేరును వెల్లడించేందుకు నిరాకరించిన ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. దేశంలో రెండో అతిపెద్ద విమానయాన సంస్థగా ఉన్న స్పైస్ జెట్ కష్టాల్లో ఉండటం, ఎయిర్ లైన్స్ పాటిస్తున్న ధరల విధానంపై పెరుగుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చివరి నిమిషంలో టిక్కెట్ కోసం వెళితే విమానయాన సంస్థలు వేలకు వేలు అదనంగా వసూలు చేస్తుండటంతో ధర నియంత్రణ తప్పనిసరని కేంద్రం భావిస్తోంది.

  • Loading...

More Telugu News