: మధు కోడా భార్య గీతా కోడా విజయం
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా పరాజయం పాలైనా, ఆయన భార్య గీతా కోడా మాత్రం విజయం సాధించారు. గతంలో మధు కోడా ప్రాతినిధ్యం వహించిన జగన్నాథ్ పూర్ నియోజకవర్గం నుంచి ఆమె ఎన్నికల బరిలోకి దిగి విజయబావుటా ఎగురవేశారు. తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన గీతా కోడా తొలి యత్నంలోనే అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు అర్హత సాధించారు. 'జైభారత్ సమంత' పార్టీ తరఫున బరిలోకి దిగిన కోడా దంపతుల్లో భర్త చతికిలబడగా, భార్యామణి మాత్రం గెలిచారు.