: టీఆర్ఎస్ ను అనుమానిస్తున్న ఎంఐఎం
మొన్నటి దాకా చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణ విషయంలో రెండు పార్టీల మధ్య అంతరం అంతకంతకూ పెరుగుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలను వెంటనే జరపాలని ఎంఐఎం కోరుతుండగా... ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లకూడదని టీఆర్ఎస్ భావిస్తోంది. మరో ప్రధానమైన అంశం ఏమిటంటే... గ్రేటర్ హైదరాబాదును మూడుగా విభజించాలనే ప్రతిపాదనపై కూడా రెండు పార్టీలు విభేదిస్తున్నాయి. తమను పాతబస్తీకి మాత్రమే పరిమితం చేయడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఎంఐఎం అనుమానిస్తోంది. అలాగే మెట్రో రైల్, వక్ఫ్ భూముల విషయంలో కూడా రెండు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయని సమాచారం. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య అంతరం పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.