: జార్ఖండ్ లో బీజేపీ బ్లాక్ మనీతో గెలిచింది: కేంద్ర మాజీ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్


జార్ఖండ్ లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్, విజయబావుటా ఎగురవేసిన బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టింది. జార్ఖండ్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ బ్లాక్ మనీని వినియోగించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్ ఆరోపించారు. ఎన్నికల్లో బ్లాక్ మనీని వినియోగించడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత్ర కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. జార్ఖండ్ లో విజయమే పరమావధిగా బరిలోకి దిగిన బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ నల్లధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News