: జపాన్ చక్రవర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ చక్రవర్తి అకిహిటోకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. అంతేగాకుండా, ఆయన జపాన్ ప్రజలకు, ప్రపంచానికి స్ఫూర్తిని అందించడం కొనసాగించాలని పేర్కొన్నారు. అకిహిటో 1933 డిసెంబర్ 23న జన్మించారు. వారసత్వ పరంపరలో భాగంగా 1989లో ఆయన జపాన్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యారు.