: విదేశీ అభిమానుల కోసం ఆన్ లైన్ లో 'హ్యాపీ న్యూ ఇయర్'
నటుడు షారుక్ ఖాన్ నటించిన 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం భారత్, చైనా కాకుండా ప్రపంచ వ్యాప్త అభిమానులకు ఇప్పుడు ఒక్క క్లిక్ లో చేరువకాబోతోంది. డైరెక్ట్ టు ఫ్యాన్ మోడల్ లో రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ ఈ చిత్రాన్ని ఆన్ లైన్ లో రిలీజ్ చేయబోతోంది. 'హ్యాపీ న్యూ ఇయర్' వెబ్ సైట్ లో ఈ సినిమా అభిమానులకు అందుబాటులో ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా అభిమానులు నగదు చెల్లించి, ఆన్ లైన్ లో చూడవచ్చు. "కొత్త ట్రెండ్స్ నెలకొల్పడంలో, అభిమానులను ఆనందపరచడంలో మా రెడ్ చిల్లీస్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలోనే బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ 'హ్యాపీ న్యూ ఇయర్'ను అభిమానుల కోసం ప్రత్యక్ష్యంగా తొలిసారి ఆన్ లైన్ స్ట్రీమింగ్ ద్వారా తీసుకురావాలనుకుంటున్నాం" అని రెడ్ చిల్లీస్ సీఈవో వెంకీ మైసోర్ వెల్లడించారు. భారత్, చైనా వంటి సంప్రదాయ డిస్ట్రిబ్యూషన్ మార్కెట్ ద్వారా హిందీ సినిమాలను చూడవచ్చు. అదే డీటీఎఫ్ (డైరెక్ట్ టు ఫ్యాన్స్) అయితే ఇతర దేశాల్లోనూ విడుదల చేయవచ్చు.