: ధోనీ పరుగులు చేయకపోయినా రికార్డే!
టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ అవడం ద్వారా ఓ చెత్త రికార్డు ధోనీ పరమైంది. ఈ జార్ఖండ్ డైనమైట్ మొత్తం 8 డకౌట్ లతో అత్యధిక 'డక్' లు నమోదు చేసిన భారత్ కెప్టెన్ గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (7 డకౌట్లు) పేరిట ఉంది. బ్రిస్బేన్ టెస్టు ధోనీకి 89వ టెస్టు మ్యాచ్ కాగా, మొత్తం మీద 59 మ్యాచ్ లలో ధోనీ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన సారథిగా ధోనీ నీరాజనాలందుకుంటున్నా, టెస్టు క్రికెట్లో మాత్రం అతని నాయకత్వంపై విమర్శల జడివాన కురుస్తోంది.