: వైఎస్ జగన్, శంకర్రావుల చేతులు కలుసుకున్నాయి!


వైపాకా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శంకర్రావుల చేతులు నిజంగానే కలుసుకున్నాయి. జగన్ పై సీబీఐ సహా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లు కొనసాగిస్తున్న దర్యాప్తునకు శంకర్రావు లేఖనే నేపథ్యమన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల మేరకే తాను హైకోర్టుకు లేఖ రాశానని నాడు శంకర్రావు బహిరంగంగానే ప్రకటించారు. ఆ తర్వాత జగన్ పై దర్యాప్తునకు హైకోర్టు సీబీఐకి ఆదేశాలివ్వడం, జగన్ జైలుకెళ్లడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఎక్కడా ఒకరికొకరు తారస పడలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి మరణం నేపథ్యంలో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించేందుకు నేటి ఉదయం జగన్ కాకా నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా జగన్, కాకాకు నివాళి అర్పించి, ఆయన కుమారులు వివేక్, వినోద్ లను పరామర్శించారు. అక్కడే ఉన్న శంకర్రావుతో కరచాలనం చేశారు. క్షణకాలమే అయినా ఇరువురూ కరచాలనం చేసుకోవడంతో పాటు పరస్పరం అభివాదం చేసుకున్నారు. కాకాకు శంకర్రావు అల్లుడు అన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News