: బౌన్సర్ తగిలి కిందపడిపోయిన వాట్సన్... ఆసీస్ ఆటగాళ్ల కలవరం


ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ మూడో టెస్టు కోసం ప్రాక్టీసు చేస్తుండగా ఓ బౌన్సర్ బలంగా తాకింది. దీంతో, కిందపడిపోయాడు. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆసీస్ ఆటగాళ్లను కలవరపరిచింది. అందరి మదిలోనూ ఫిల్ హ్యూస్ ఉదంతం మెదిలింది. బంతి విసిరిన జేమ్స్ ప్యాటిన్సన్ అయితే తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. కాసేపటికి వాట్సన్ తేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. వాట్సన్ కు బౌన్సర్ తాకిందని, అయితే, ప్రమాదం ఏమీ లేదని పేర్కొంది. అంతకుముందు, పేసర్ మిచెల్ స్టార్క్ కూడా మోకాలికి బంతి తగలడంతో ప్రాక్టీసు ఆపేశాడు.

  • Loading...

More Telugu News