: ప్రజాప్రతినిధులు స్వయంగా వస్తేనే వైకుంఠ ఏకాదశి పాస్ లు చెల్లుతాయట


కొత్త ఏడాది తొలిరోజున వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమలకు వచ్చే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరికి ఆరుపాసులు ఇస్తున్నట్టు ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం సదరు ప్రజాప్రతినిధి లేదా వారి సతీమణి కానీ వ్యక్తిగతంగా హాజరైతేనే పాసులు చెల్లుబాటవుతాయని స్పష్టంచేశారు. లేదంటే వారి పిల్లలను కూడా పాసులమీద అనుమతించబోమని అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో చెప్పారు.

  • Loading...

More Telugu News