: సీఎం విమానాన్ని నెట్టుకుంటూ వెళ్ళిన భద్రతా సిబ్బంది


అది మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం. ఆ విమానాన్ని రన్ వే మీదకు చేర్చడానికి భద్రతా సిబ్బంది ఓ పట్టు పట్టాల్సి వచ్చింది. అసలు విషయమేంటంటే... చిండ్వారాలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విమానంలో వచ్చారు. ఆపై కొంతసేపటికి ఎంపీ కమల్‌నాథ్‌ ప్రత్యేక విమానంలో చిండ్వారా వస్తున్నారన్న సమాచారం మేరకు సీఎం విమానాన్ని పక్కకు జరిపారు. తిరిగి సీఎం బయలుదేరే సమయంలో ఆయన భద్రతా సిబ్బంది విమానాన్ని నెట్టుకుంటూ రన్ వేపైకి తీసుకెళ్ళారు. చిండ్వారా విమానాశ్రయం చిన్నగా ఉండటం, పార్కింగ్ సమస్యల కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News