: వెంకటస్వామి భౌతిక కాయానికి చంద్రబాబు నివాళి


కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ తొలితరం నేత జి.వెంకటస్వామి భౌతిక కాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం నివాళి అర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటస్వామి సోమవారం సాయంత్రం మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెంకటస్వామి నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. అనంతరం వెంకటస్వామి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

  • Loading...

More Telugu News