: ఒకే రాత్రి నాలుగు దుకాణాలను దోచేశారు!


దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఒకే రాత్రి నాలుగు దుకాణాలను లూటీ చేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐజ మండలం వెంకటాపురం గ్రామంలో జరిగింది. మొత్తం నాలుగు దుకాణాల్లో చోరీ జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఓ దుకాణంలో రూ.4 లక్షల విలువ చేసే బంగారం, వెండిని దొంగలు అపహరించినట్టు తెలుస్తోంది. మిగతా దుకాణాల్లో చోరీకి గురైన సొత్తు విలువను పోలీసులు అంచనా వేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News