: 500 మందిని ఉరితీస్తాం: పాకిస్తాన్
మరణశిక్ష పడ్డ 500 మంది ఉగ్రవాదులకు అతిత్వరలో శిక్షలు అమలు చేస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. తొలుత 55 మందికి ఉరిశిక్షను అమలు చేసేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. వీరికి సంబంధించిన క్షమాభిక్ష పిటిషన్లను తమ దేశాధ్యక్షుడు మన్మూన్ హుస్సేన్ తిరస్కరించారని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. ఉగ్రవాదులకు మరణశిక్షలు అమలు చేయడం వల్ల వచ్చే ఎలాంటి పరిణామాలను ఎదుర్కొనేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తాను పెంచి పోషించిన ఉగ్రవాదులు దారుణ మారణకాండను సృష్టించడంతో, పాకిస్తాన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. గత నాలుగురోజుల్లో ఆరుగురు ఉగ్రవాదులను పాక్ జైళ్లలో ఉరి తీశారు.