: జమ్మూ కాశ్మీర్ తొలి ట్రెండ్స్ లో పీడీపీ లీడ్... స్వల్ప తేడాలో బీజేపీ
జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ లలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమయింది. తొలి ట్రెండ్స్ నెమ్మదిగా వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో 30 స్థానాల్లో పీడీపీ లీడ్ లో ఉండగా, బీజేపీ 23 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ 6, నేషనల్ కాన్ఫరెన్స్ 13 చోట్ల లీడ్ లో ఉన్నాయి. జార్ఖండ్ లో 13 స్థానాల్లో బీజేపీ, 7 స్థానాల్లో జేఎంఎం, 2 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. ధన్వార్ లో బాబూలాల్ మరాండీ, ఖర్ స్వాన్ లో అర్జున్ ముండా ఆధిక్యంలో ఉన్నారు.