: సలహా అడుగుతారు... ఇవ్వబోతే ఎదురు దాడి చేస్తారు: కొడాలి నాని
రాజధాని కోసం అవసరమైన భూములను రైతులు ఇస్తేనే తీసుకోవాలని... బలవంతంగా లాక్కోరాదని వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. బలవంతంగా లాక్కుంటే రైతుల పక్షాన వైకాపా పోరాటం చేస్తుందని హెచ్చరించారు. రాజధాని భూముల సేకరణ తీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఉందని ఎద్దేవా చేశారు. రాజధానికి సంబంధించి సలహాలు ఇవ్వాలంటూ ప్రతిపక్షాన్ని అడుగుతారని... ఇవ్వబోతే ఎదురు దాడి చేస్తారంటూ టీడీపీపై మండిపడ్డారు. మూడు పంటలు పండే భూములను లాక్కోరాదని... అటవీ భూములను రాజధాని నిర్మాణం కోసం ఉపయోగించుకోవాలని సూచించారు.