: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ సభ్యత్వం 50 లక్షలు... ట్రస్టు భవన్ లో సంబరాలు
తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రాల్లో మరింత బలోపేతమైంది. గతంలో ఏ పార్టీకి లేనంతమంది క్రియాశీల సభ్యులు ఆ పార్టీలో చేరారు. దాదాపు నెలకు పైగా జరిగిన స్పెషల్ డ్రైవ్ ఇటీవలే ముగిసింది. సభ్యత్వ నమోదులో కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఆ పార్టీ క్రియాశీల సభ్యులుగా 50 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో యువనేత లోకేష్ నేతృత్వంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసిన లోకేశ్, కార్యకర్తల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.