: లండన్, సిమ్లాల కంటే ఢిల్లీలోనే చలి ఎక్కువ
దేశ రాజధాని ఢిల్లీని చలి పులి వణికిస్తోంది. ఇటీవలి కాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ఢిల్లీలో... అత్యంత శీతల నగరాలుగా పేరుగాంచిన లండన్, సిమ్లాల కంటే కూడా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 4.2 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ఢిల్లీ, పర్వత ప్రాంతాలైన ముస్సోరీ, సిమ్లాల కంటే శీతల నగరంగా అవతరించింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలే కాక గరిష్ఠ ఉష్ణోగ్రతల విషయంలోనూ ఢిల్లీ రికార్డులు సృష్టించింది. సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 15.8 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. సిమ్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీలు కాగా కనిష్ఠ ఉష్ణోగ్రత 6.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఇక లండన్ లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.