: ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తాం: బాబు


ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శాసనసభలో సీఆర్డీఏ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీకి రాజధాని నిర్మాణం ఇష్టం లేదని అన్నారు. అందుకే రాజధాని నిర్మాణ ప్రాంతంలోని రైతులను భయభ్రాంతులను చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి సహకరించే రైతులకు అన్యాయం జరగకుండా ఉండాలనే లక్ష్యంతో తాము అత్యుత్తమ పరిష్కారాలు సూచిస్తున్నామని అన్నారు. రాజధాని నిర్మాణంలో ఉపయోగపడే అంశాలు ఎవరు చెప్పినా స్వీకరిస్తామని బాబు తెలిపారు. రాజకీయాలు విడనాడి భవిష్యత్ తరాలకు భరోసా ఇచ్చే రాజధానిని నిర్మించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలని ఆయన కోరారు. కనీసం ఓ ఇటుకను రాజధాని కోసం విరాళమివ్వాలని ఆయన సూచించారు. రాజధాని నిర్మాణంలో తన భాగస్వామ్యం ఉందని ప్రతి ఒక్కరూ భావించాలని ఆయన వివరించారు. తమను అన్యాయానికి గురి చేసినా తాము నిలదొక్కుకుని భవిష్యత్ తరాలు గర్వించే రాజధానిని నిర్మించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News