: భువనేశ్వర్ కు ప్రమోషన్... యువీ, గంభీర్, దినేష్ కార్తీక్ లకు మొండి చెయ్యి!


టీమిండియా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ కు ప్రమోషన్ లభించింది. అదే సమయంలో సీనియర్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, దినేష్ కార్తీక్ కు మొండిచెయ్యి చూపింది. బీసీసీఐ టీమిండియా ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితా విడుదల చేసింది. ఇందులో యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ అనూహ్యంగా పైకి ఎగబాకాడు. 2014-15 సంవత్సర గ్రేడ్ లలో భువీ ఏ గ్రేడ్ దక్కించుకున్నాడు. టీమిండియా కెప్టెన్ ధోనీ, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సురేష్ రైనాలతో పాటు భువీ కూడా ఏ గ్రేడ్ ను దక్కించుకున్నాడు. యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ లకు బీసీసీఐ కాంట్రాక్టులో స్థానం దొరకలేదు.

  • Loading...

More Telugu News